..భారత్ న్యూస్ హైదరాబాద్….నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్…?
తెలంగాణ: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న(సోమవారం) అసెంబ్లీ హాలులో CM రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

