భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…నాగ్ పూర్ లో భారీ పేలుడు….15మంది మృతి
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్ పూర్లో భారీ పేలుడు సంభవించింది. కటోల్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్లో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. ఉదయం ఇందులోని ఒక యూనిట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని.. ఆ సమయంలో, 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారని తెలిపారు….