నేడు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం

ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో నేడు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది.

ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.