భారత్ న్యూస్ తిరుపతి…అందుబాటులోకి తితిదే డైరీలు, క్యాలెండర్లు
తితిదేకు చెందిన 2026 సంవత్సర డైరీలు, క్యాలెండర్లు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఎంపిక చేసిన ప్రాంతాల్లో, తితిదే వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నట్లు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. తితిదే వెబ్సైట్ www.tirumala.org, ttdevasthanams.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ ద్వారా ఇంటికే పంపిస్తామని తెలిపారు.
