శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

భారత్ న్యూస్ రాజమండ్రి…ఢిల్లీ :

•Ammiraju Udaya Shankar.sharma News Editor… శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

• బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేసిన సిఎం

• అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించిన ముఖ్యమంత్రి

• శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశం

• దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచన

• భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశం

• దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం ఆదేశం

• రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశం

• శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ముఖ్యమంత్రి ఆదేశం.