ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు భారత్‌లోనే ఎక్కువ

భారత్ న్యూస్ ఖమ్మం…..ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు భారత్‌లోనే ఎక్కువ

2023లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు భారత్‌, నైజీరియాలోనే ఎక్కువని ప్లాస్‌ జర్నల్‌ అధ్యయనం వెల్లడించింది. మొత్తం ప్రపంచ వ్యాప్త మరణాల్లో మూడింట ఒక వంతు వాటా ఈ రెండు దేశాలదేనని పేర్కొన్నది. దాని ప్రకారం నైజీరియాలో 7.7 లక్షల మంది, భారత్‌లో 6.4 లక్షల మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. పెకింగ్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ప్రపంచం మొత్తం మీద 1990లో 1.29 కోట్లుగా ఉన్న ఈ తరహా మరణాలు 2023 నాటికి 47 లక్షలకు తగ్గాయి