రియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరిన మృతులు : 26 మందికి గాయాలు..!!

…భారత్ న్యూస్ హైదరాబాద్….రియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరిన మృతులు : 26 మందికి గాయాలు..!!

వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ కార్మికులు
కుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సిగాచీ కెమికల్ పరిశ్రమలో ఘటన
సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి

ఘటనా స్థలికి మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ
పటాన్ చెరు/హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8 మంది దుర్మరణం పాలయ్యారు. 26 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 9.00- 9.30 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు చికిత్స పొందుతూ కన్ను మూశారు. పేలుళ్ల ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్ప కూలింది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ఆర్పేస్తున్నాయి. రసాయనాలు కాలిపోతుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐజీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ 26 మందిలో కొందరు సీరియస్ గా ఉన్నారని చెప్పారు.

మొత్తం షిప్ట్ లో 150 మంది కార్మికులు ఉన్నట్టు చెబుతున్నారని వివరించారు. . రెండో బ్లాక్ ను ఓపెన్ చేస్తున్నామని, అందులో ఎవరైనా ఉన్నారా..? అనేది చూడాలని ఐజీ తెలిపారు. సంఘటన స్థలానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేరుకున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఐజీ సత్యనారాయణ కథనం ప్రకారం ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. మరో 26 మందిగాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలుస్తోంది. మొత్తం షిప్ట్ లో 150 కార్మికులు పనిచేస్తున్నారని చెబుతున్నారు.

వారిలో 32 మందికి సంబంధించిన వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి. మిగతా 118 మంది తప్పించుకున్నారా..? లేక రెండో బ్లాక్ లో ఉన్నారా.? అనేది తెలియాల్సి ఉంది. అడ్మిన్ బ్లా క్ పూర్తిగా కుప్పకూలడం, రసాయన పదార్థాలు దగ్ధమవుతుండటంతో ఘాటైన వాసనలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు.