పిల్లల పెంపకంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..*

..భారత్ న్యూస్ హైదరాబాద్…పిల్లల పెంపకంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..*

పిల్లల పెంపకంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణతో పిల్లలను పెంచే బాధ్యతను తల్లి పట్టించుకోకపోతే కుటుంబం, సమాజం పునాదులు కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.ఓ పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూర్కు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి కూతురు(14)తో ఉంటోంది. అయితే ఆ మహిళకు స్థానికంగా ఉంటున్న మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఏర్పడింది. 2017లో ఆమె కూతురుపై కూడా అతడి కన్ను పడింది. దీంతో బాలికను అతడు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిక చెప్పగా ఎవరికైనా ఈ విషయం చెబితే సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి బాలికను లైంగికంగా వేధించడం కొనసాగించాడు. చివరికి ఆ బాలిక తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన కోయంబత్తూరు పోక్సో కోర్టు.. 2020లో బాలిక తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.పోక్సో కోర్టు తీర్పును సవాలు చేస్తూ వీళ్లిద్దరూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ వేల్మురుగన్, జస్టిస్ జ్యోతిరామన్ ధర్మాసనం విచారణ జరిపింది. పోక్స్ కోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ ఈ పిటిషన్ను కొట్టివేశారు. తల్లుల అనైతిక ప్రవర్తన వల్లే పిల్లలపై ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మన సంస్కృతిలో తల్లికి అధికంగా ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. పిల్లలను సురక్షితంగా, గౌరవంగా, క్రమశిక్షణతో పెంచే బాధ్యత తల్లిపై ఉంటుందని పేర్కొంది. ఇలాంటి పవిత్రమైన బాధ్యతను తల్లి విస్మరిస్తే ఆమె కుటుంబమే కాక సమాజం కూడా తన పునాదిని కోల్పోతుందని వ్యాఖ్యానించింది.