మతోన్మాదులతోనే దేశానికి ప్రమాదకరం.

భారత్ న్యూస్ డిజిటల్:భూపాలపల్లి: తెలంగాణ: మతోన్మాదులతోనే దేశానికి ప్రమాదకరం
దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
భూపాలపల్లి లో సిపిఐ శత వార్షికోత్సవాల భారీ పైలాన్ ఆవిష్కరణ
భూపాలపల్లి:
మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదరికం, నిరుద్యోగం రెట్టింపు అయ్యాయని, ఇండ్లు లేని నిరుపేదలు పెరిగి పోయారని, ఆదివారం భూపాలపల్లి లో సిపిఐ శత వార్షికోత్సవాల భారీ పైలాన్ ఆవిష్కరణ బహిరంగ సభ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోడీ దృష్టి అంతా కార్పొరేట్ శక్తుల పైనే ఉండడంతో పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించిన బిజెపి యుద్దోన్మాదానికి కూడా తెరలేపిందని, మతోన్మాదులు, యుద్దోన్మాదులతో దేశానికి ప్రమాదకరం అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పేరు మీద ధనస్వామ్యం, భూస్వామ్యం, ఫాసిజం రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. దేశభక్తి ముసుగులో బీజేపీ కార్పొరేట్ వర్గాలకు దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు. కోట్ల సంవత్సరాలు చరిత్ర కలిగిన అరావళి పర్వతాలను ఆదాన్ని మైనింగ్ కంపెనీకి కట్టబెట్టేందుకు బిజెపి ప్రభుత్వం కట్టబెడుతున్నదని విమర్శించారు. ప్రకృతిని, పర్యావరణాన్ని ద్వంసం చేస్తూ దేశ సంపదను, సహజ వనరులను కార్పొరేట్ వర్గాలకు దోచి పెడుతున్న బీజేపీ ప్రభుత్వం చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మంది ప్రజలతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు జిల్లా నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నూరు సంవత్సరాలు డిసెంబర్ 26 కు పూర్తి చేసుకుంటున్నదని అని తెలిపారు. జాతీయ ప్రజాతంత్ర విప్లవం లక్ష్యంగా, సోషలిజం ధ్యేయంగా, సామాజిక న్యాయం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో సిపిఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతోమంది అమరవీరులను అందించిన చరిత్ర సిపిఐదని అన్నారు. దున్ని వాడికి భూమి దక్కాలని, భూమిలేని నిరుపేదలకు భూమి పంచాలని పోరాడి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చేపట్టి వేలాది గ్రామాలను విముక్తి చేసిన ఘన చరిత్ర సిపిఐకి మాత్రమే ఉందన్నారు. దేశంలో వామపక్ష పార్టీల ఐక్యతా పోరాటాలను ఉధృతం చేస్తూ, లౌకిక ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేస్తూ ప్రజాస్వామ్య పోరాటాలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు,
జనవరి 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభ
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు
ఈ సభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు
మాట్లాడుతూ జనవరి 18న సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ అధిక సంఖ్యలో పాల్గొనలనికి పిలుపునిచ్చారు.