కాంగ్రెస్‌ షాక్.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఎం….

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్‌ షాక్.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఎం….

తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో జతకట్టిన లెఫ్ట్​ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కుంటున్నాయి. రెండు పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో జత కడుతున్నాయి. సీపీఎం కొన్నిచోట్ల కాంగ్రెస్‌​తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్‌​తో జతకడుతోంది. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం నిర్ణయించగా.. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌​తో సీట్ల సర్దుబాటు కోసం గట్టిగా పట్టుబడుతోంది…..