…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ వాసులకు సీఎం కీలక ఆదేశాలు!
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలకు సూచించారు.
