గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త!

..భారత్ న్యూస్ హైదరాబాద్….గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త!

సంక్రాంతి సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగులు సందడి చేస్తున్నాయి. కానీ ఆ సరదా వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే చైనా మాంజా. దీనిపై నిషేధం ఉన్నా ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయమైంది. బైక్పై వెళ్తున్న అతడి మెడను మాంజా కోసేయడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు మీరూ జాగ్రత్త వహించండి…