భారత్ న్యూస్ అమరావతి..అమరావతి,,నారా చంద్రబాబు, ముఖ్యమంత్రి.అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.

A. Udaya Shankar.sharma News Editor…
హైటెక్ సిటి రాకముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది.
పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది.
అమరావతి రైతులకు అన్యాయం జరగదు.
అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది.
అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది.
హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది.
గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుంది.
భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం.
ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం.
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి.
అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయి.
ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది.
ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది.
దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారింది.
కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది.
హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం.
నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం.
పైగా వృధా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం.
పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది.
చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం.
ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారు.
మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు.
మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్దతినే నిర్మాణం చేపడుతున్నాం… ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు…
నిర్వహణ ప్రభుత్వానిదే.
వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది.
ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు.

