భారత్ న్యూస్ విశాఖపట్నం..చెన్నె సూపర్ కింగ్స్ పరుగుల విధ్వంసం
సంజు శాంసన్ సెంచరీ

ఐపీఎల్ 2026లో భాగంగా తన సొంత గడ్డ అయిన ఎంఏ చిదంబరం మైదానంలో చెన్నె సూపర్ కింగ్స్ (CSK) పరుగుల విధ్వంసం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ (115) విశ్వరూపం ప్రదర్శించాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్‌లో లేడంటూ వస్తున్న విమర్శలకు సంజూ శాంసన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజూ, ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ భారీ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. సంజూకు తోడుగా యువ బ్యాటర్ ఆయూష్ అద్భుతమైన మద్దతు అందించాడు. సంజూ విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు ఆయూష్ క్లాసీ షాట్లతో అలరిస్తూ కీలకమైన హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యం చెన్నెకి కొండంత స్కోరును అందించింది. మొత్తంగా చెన్నె సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది..