ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమే తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి :మార్చి 21
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమే తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం పాల్గొన్నది .

అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం దగ్గర చంద్రబాబు కుటుంబానికి ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, స్వాగత ఏర్పాట్లు చేశారు.అనం తరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వా మి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహ స్వామివారిని దర్శించుకు ని హుండిలో కానుకలు సమర్పించారు.

శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో అర్చకులు వేదాశీర్వచ నాలు ఇవ్వగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను ఛైర్మన్, ఈవోలు అందించారు.

అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు కుటుంబం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించింది. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కాలి నడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్‌కు వెళ్లారు. తిరుమల మాడవీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. అలాగే తిరుమల మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో చంద్రబాబు, దేవాన్ష్ ఫోటో దిగారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల దగ్గరకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. కొందరు భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.