తెలంగాణలోని 7 మండలాలను విలీనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

భారత్ న్యూస్ ఖమ్మం…..తెలంగాణలోని 7 మండలాలను విలీనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Apr 03, 2026,

తనకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించానని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఉండేదని, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయమే తన క్యాంపు కార్యాలయం అని, బస్సులోనే బస చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్‌ ఉంటుందని సంకల్పించామని సీఎం తెలిపారు.