నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

…భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి

కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్

మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు

ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపిన బాధితుడు శివ ప్రసాద్

శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించిన బెల్లంకొండ సురేష్

దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేసిన శివ ప్రసాద్.. కేసు నమోదు చేసిన పోలీసులు…