చెన్నూర్ నుంచి మంచిర్యాల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కూరగాయల వ్యాపారి చేసిన పని.ఆశ్చర్యానికి గురిచేసింది

భారత్ న్యూస్ వరంగల్….. …..మంచిర్యాల జిల్లా..

చెన్నూర్ లో ఫ్రీ బస్సు సిత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి!

చెన్నూర్ నుంచి మంచిర్యాల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కూరగాయల వ్యాపారి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రయాణం అంటే చాలా మందికి టైం వేస్ట్… కానీ ఆమెకు మాత్రం అది గోల్డెన్ టైమ్!

బస్సులో కూర్చుని ఖాళీగా ఉండకుండా… చేతిలో తోటకూర… చకచకా కట్టలు కడుతూ తన పని కొనసాగించింది. ఇదంతా కెమెరాలో బంధించడంతో ఈ సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది.

“సమయం అంటే డబ్బు” అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ… ప్రయాణంలోనే సంపాదనకు దారి తీస్తున్న ఈ మహిళ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇక ఫ్రీ బస్సు అంటే కేవలం ప్రయాణం కాదు…
కొంతమందికి పని చేసే స్థలం…
మరికొందరికి ఆదాయం పెంచుకునే అవకాశం…
ఇంకొందరికి కొత్త ఐడియాలకు వేదికగా మారింది!

ఒక్కో మహిళ ఒక్కో స్టైల్‌లో…
ఫ్రీ బస్సును తమదైన రీతిలో ఉపయోగించుకుంటూ…
“టైమ్ వేస్ట్ కాదు… టైమ్ యూజ్!” అని చెబుతున్నారు.

మొత్తానికి… చెన్నూర్ ఫ్రీ బస్సులో ఇది కేవలం ప్రయాణం కాదు… ఓ చిన్న జీవన పోరాటం… ఓ తెలివైన జీవన విధానం అని తెలియజెప్పారు..