జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం!

భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమై అయినప్పటి నుంచి నవీన్ యాదవ్ కు రౌండ్ రౌండ్ కు ఆదిక్యంపెరుగుతూనే ఉంది,

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్,25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

మరోవైపు ఏ ఒక్క రౌండ్ లోను మాగంటి సునీత, అధిక్యం దక్కించుకోలేక పోయారు. ఈ గెలుపు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.