జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రేపే విడుదల

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రేపే విడుదల

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.

రేపటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.
22న నామినేషన్ల పరిశీలన చేపడతారు.
24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
నవంబర్ 11న పోలింగ్ జరగగా, 14న కౌంటింగ్ జరుగుతుంది.

ఈ ఉపఎన్నికపై రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచనను ప్రారంభించాయి.