ఏసీబీకి చిక్కిన జిల్లా సహకార అధికారి…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఏసీబీకి చిక్కిన జిల్లా సహకార అధికారి…

ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చేజెక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొమరంభీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ ను రెన్యువల్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రెండు విడుతలుగా రూ 8 లక్షల ఇచ్చేంద్దుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడత రూ 2 లక్షలు ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్ళగా, జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు.