భారత్ న్యూస్ హైదరాబాద్….అరెస్టుల నుంచి కాపాడేందుకు BRS నుంచి బీజేపీకి మామూళ్లు: CM రేవంత్….
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని BJP-BRS కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడ్డ BRS నేతలను కాపాడుకుంటూ బీజేపీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకొని, మున్సిపల్ ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోపు కేసీఆర్, హరీశ్, KTRను అరెస్టు చేసి ఓట్లు అడగాలన్నారు….
