..భారత్ న్యూస్ హైదరాబాద్..’బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది’.. మండలిలో కవిత కంటతడి

Ammiraju Udaya Shankar.sharma News Editor… ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. “కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. బీఆర్ఎస్ నుంచి అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. గతేడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా” అని మాట్లాడారు.
