BHARATH NEWS: HYDERABAD:
అంబర్ పేట ను
చుట్టేసిన ఆపద మిత్రులు*
బతుకమ్మకుంటలో బోటు రిహార్సల్స్
హైదరాబాద్, డిసెంబర్ 22:
యువ ఆపద మిత్రులు అంబర్‌పేటకు సోమవారం వచ్చారు. బతుకమ్మకుంటను సందర్శించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తకుండా.. బతుకమ్మకుంట ఎలా కాపాడుతుందో హైడ్రా అధికారులు వారికి వివరించారు. అంతే కాదు.. వరదలు వచ్చినప్పుడు చిక్కుకున్న వారిని బోటులో వెళ్లి ఎలా కాపాడాలో బతుకమ్మ కుంటలో ప్రాక్టీసు చేశారు. బోటులో కలియదిరిగారు. బతుకమ్మకుంట చరిత్రను తెలుసుకుని నివ్వెరపోయారు. కబ్జాలను తొలగించి.. వేలాది ట్రక్కుల మట్టిని తీసి.. ఇంత సుందరమైన చెరువును రూపొందించడం గొప్ప పరిణామం అని అన్నారు. బతుకమ్మ ఆటలాడిన చిత్రాలను చూసి మురిసిపోయారు.

6వ రోజు శిక్షణలో భాగంగ…
భారత్ డిజిటల్ న్యూస్ : అమరావతి: తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు ఈరోజు అనగా తేది.22.12.2025న పగల్ పత్తు ఉత్సవములలో భాగంగా సాయంత్రం 6.30గంIIలకు 3వ ఉత్సవము అయిన కోదండరామ అవతారములో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాధ స్వామి వారు కనివిందు చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ఉభయదాత ‘’శ్రీ అనుమాలశెట్టి నారాయణరావు’’ వారు వ్యవహరించినారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ఈఓ శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు మరియు దేవస్థాన సిబ్బంది వారు కార్యక్రమము నందు పాల్గొనడం జరిగినది