భారత్ న్యూస్ ఢిల్లీ…..
ప్రభుత్వ పథకాల పేరిట బీజేపీ చందాల దందా!
2021-22లో అక్రమంగా విరాళాల వసూళ్లు.నరేంద్రమోదీ.ఇన్, నమో, యాప్ ద్వారా సేకరణ.ఆర్‌టీఐ జవాబులతో అక్రమాలు వెలుగులోకి.
స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, కిసాన్ సేవ వంటి ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కొన్నేళ్ల క్రితం బీజేపీ ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు వసూలు చేసినట్లు బయటపడింది.

సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్టు, చానెల్ సత్యం టీవీ న్యూస్ ఎడిటర్ బీఆర్ అరవిందాక్షన్ అడిగిన ప్రశ్నలకు లభించిన జవాబులను బట్టి చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం విరాళాలు వసూలు చేసేందుకు కేంద్ర మంత్రులు లేదా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నుంచి బీజేపీకి ఎటువంటి ప్రత్యేక అనుమతులు కాని అధికారం కాని లేవని అర్థమవువుతున్నది.