భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,రేపు భారత్ బంద్‌కు పిలుపు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
