..భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్స్ కేసు.. మూడు రాష్ట్రాల్లో సీఐడీ సోదాలు
📍హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా 007, ఫెయిర్‌ప్లే లైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, వీఎల్ బుక్, తెలుగు 365, యస్ 365 యాప్‌లను ఈ ముఠా నిర్వహిస్తోంది.
