భారత్ న్యూస్ విజయవాడ…అదరగొట్టిన బ్యాటర్లు.. ఫైనల్లో భారత్ భారీ స్కోర్
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో ప్రోటీస్ జట్టు ముందు 299 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత్ బ్యాటర్లలో షఫాలీ వర్మ( 87) సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడింది. తర్వాత దీప్తిశర్మ 58, స్మృతి మంధాన 45 , రిచా ఘోష్ 34 పరుగులు చేశారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో అయోబొంగా ఖాకా 3 పడగొట్టింది. మ్లాబా, డి క్లెర్క్ , క్లో ట్రయాన్ తలా వికెట్ తీశారు..
