దిమ్మెలపై బతుకమ్మ చీరల దర్శనం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….దిమ్మెలపై బతుకమ్మ చీరల దర్శనం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహి నకిరేకల్:
కొందరు అధికారులు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి మహిళల ఆగ్రహానికి గురవుతున్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుండా వాటిని ఆరుబయట పార్టీ దిమ్మెలకు కట్టడంపై మండిపడుతున్నారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను నిర్లక్ష్యంగా అలా కట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తరపున తమకు రావాల్సిన చీరలను అవమానకరంగా ప్రదర్శించడంపై స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతికి చిహ్నమైన చీరలను ఇలా నిర్లక్ష్యంగా దిమ్మలకు చుట్టి మహిళల మనోభావాలను దెబ్బతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ జెండాలకు చుట్టిన అధికారులు