ఆ పెయిన్‌కిల్లర్‌ అధిక డోసులపై నిషేధం.. కేంద్రం ప్రకటన

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆ పెయిన్‌కిల్లర్‌ అధిక డోసులపై నిషేధం.. కేంద్రం ప్రకటన

ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ఔషధం నిమెసులైడ్‌ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

నోటి ద్వారా తీసుకొనే ఈ ఔషధం అధిక డోసులపై నిషేధం విధించింది.

ఆరోగ్యపరమైన భద్రతా కారణాల రీత్యా నిమెసులైడ్‌ (Painkiller Nimesulide) 100 ఎంజీకి మించి డోసు ఉండే ఔషధాల తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ మేరకు డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డుతో చర్చించిన అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) దీనిపై నోటిఫికేషన్‌ జారీ చేసింది.