..భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభంకానున్న ‘సీఎం కప్-2026’ క్రీడా పోటీలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా మొత్తం 44 రకాల క్రీడల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
