భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అంగన్వాడీలో అఘాయిత్యం
ఆలస్యంగా వెలుతులోకి వచ్చిన ఘటన
ముక్కు పచ్చలు ఆరని బాలికపై అత్యాచారం
అంగన్ వాడీ టీచర్ కుమారుడే నిందితుడు…..?
నేరస్తుని చట్ట ప్రకారం శిక్షించాలి అంగన్వాడి లో అల్లారుముద్దుగా ఆడుకోవలసిన చిన్నారిపై అఘాయిత్యం. ముక్కుపచ్చలారని నాలుగెండ్ల బాలికపై 16 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఖానాపురం మండలం గొల్లగూడెంతండా అంగన్ వాడీ కేంద్రంలో జరిగిందని బాధిత బాలిక తల్లి కథనం ప్రకారం నా యొక్క కూతురు (4) ను అంగన్ వాడీ టీచర్ మూడుపద్మ నిర్వహించే గొల్లగూడెం తండా అంగన్ వాడీ బడికి పంపిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా
మా అమ్మ మంగమ్మ వద్ద నా కూతురిని ఉంచి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కు అక్కడ పని చూసుకోవడానికి వెళ్ళాను. కాగా ఈనెల 25 శనివారం రోజున ఎప్పటిలాగానే మా అమ్మ దగ్గర నా కూతురిని వదిలిపెట్టి మా అమ్మ అంగన్ వాడీ టీచర్ పద్మకు అప్పగించగా
ఆ రోజు అంగన్ వాడీ టీచర్ లేని సమయంలో అంగన్ వాడీ టీచర్ కుమారుడు మూడు మణిపాల్ (16) గదిలో అడ్డుగా కట్టిన పరదా చాటుకు తీసుకెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపింది. అదే రోజున కడుపు నోప్పి అంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన నాకూతురు నా తల్లి ఆరతీయగా అసలు విషయం బయటపడింది ఆ విషయాని నాకు పోన్ ద్వారా మా అమ్మ సమాచారం తెలపడంతో హైదరాబాద్ నుంచి నేను తిరిగి వచ్చి. నా కూతురు పై జరిగిన అఘాయిత్యని పరిశీలించగా పోట్టబాగం, ప్రయివేటు బాగం గాయంతో వాపు వచ్చి ఉంది. బాలిక భోజనం కూడ తినడం లేదని ,నోప్పి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉందన్నారు.
తమ కూతురుపై జరిగిన అఘాయిత్యంపై న్యాయం చేయాలని కోరింది. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలిక తల్లి తెలిపారు.
