భారత్ న్యూస్ వరంగల్….సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ తో ఘన నివాళి
తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం మరుడైన సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ ప్రజా రౌండ్ టేబుల్ సమావేశం హనంకొండలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది.
సాయిశ్వర చారి గారి చిత్రపటానికి ప్రొఫెసర్ వెంకటనారాయణ ప్రొఫెసర్ సారంగపాణి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్ , మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ , కోకన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి, బీసీ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ కన్వీనర్ బుసిగొండ ఓంకార్, బీసీ సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బుట్టి శ్యామ్, అడ్వకేట్ వివేక్, వేణుమాధవ్, సుధీర్, రామారావు, టిఆర్పి పార్టీ వరంగల్ అధ్యక్షుడు సంపత్ పటేల్ , రామారావు, స్వర్ణకారుల జిల్లా అధ్యక్షుడు పానుగంటి శ్రీధర్, మైనార్టీ నాయకులు నయీమ్, అంజద్ మీర్జా , కత్తరశాల దామోదర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రొఫెసర్ వీరస్వామి, డాక్టర్ కూరపాటి రమేష్ ప్రొఫెసర్ రాములు, మల్లేశం, తదితరులు సాయి ఈశ్వర చారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం సాధించి వారికి నివాళులర్పిస్తామని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి బీసీకి ఓటు వేసి అత్యధిక స్థానాలు సాధించి సాయి ఈశ్వర చారి గారికి ఆ గెలుపును నివాళులుగా ఇద్దామని తీర్మానించారు, పార్లమెంటు శీతాకాల సమావేశంలో బీసీ బిల్లును ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ప్రైవేట్ బిల్లునున్న ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లను సాధించాలని రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ తొమ్మిదిలో అమర్చి రాజ్యాంగబద్ధంగా బీసీలకు హక్కులను సాధించే విధంగా పోరాటం ముందుకు సాగాలని త్వరలో 500 మందితో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని సభ ఉమ్మడిగా ప్రతిపాదించింది. వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను మంత్రులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను రాజీనామా చేసి ప్రత్యక్ష బీసీ ఉద్యమాలకు వచ్చి బీసీ హక్కులను సాధించాలని డిమాండ్ చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ఉంటేనే బీసీ ఉద్యమం ముందుకు సాగుతుందని మనం కోరుకున్న లక్ష్యాన్ని చేదించవచ్చని పలువురు మేధావుల అభిప్రాయపడ్డారు పార్టీ విధివిధానాలు ఏది ఉన్నప్పటికీ కూడా తాను బీసీల కోసం ముందు ఉంటానని దాస్యం వినయ్ భాస్కర్ చెప్పడం జరిగింది, మేధావులు త్వరలో రాష్ట్రవ్యాప్త కార్యాచరణతో ఢిల్లీ మెడల్వంచైనా బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు త్వరలో ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిద్దామని పిలిపించాను ఈ కార్యక్రమంలో అనిశెట్టి సాయి తేజ, జూగంటి రవీందర్, నలుబాల రవి కుమార్, నలుబోల సంజయ్, వివైఏ జిల్లా అధ్యక్షుడు నారాయణగిరి రాజు, కేడల ప్రసాద్, రాసూరి రాజేష్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు
