యూట్యూబర్ అన్వేష్ పై మరో కేసు నమోదు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….యూట్యూబర్ అన్వేష్ పై మరో కేసు నమోదు

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్లోనూ అన్వేష్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడం పై విమర్శలు వెల్లువెత్తాయి.