చికెన్ సెంటర్ లో పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు:బ్రహ్మాజీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…చికెన్ సెంటర్ లో పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు:బ్రహ్మాజీ

హన్మకొండ జిల్లా:
చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు.ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్య దర్శి చక్రపాణితో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర,పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని ఆయన వ్యక్తం చేశారు.