మెదక్ జిల్లాలోని టెక్మల్ ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు వేగంగా స్పందించి అరెస్ట్ చేయటంపై ఏసీబీ శాఖను

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మెదక్ జిల్లాలోని టెక్మల్ ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు వేగంగా స్పందించి అరెస్ట్ చేయటంపై ఏసీబీ శాఖను, ముఖ్యంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి చారు సిన్హా, IPS గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి, IPS అభినందించారు.

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అధికారులు అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని డీజీపీ అన్నారు. తమ జిల్లాలకు సంబంధించి పర్యవేక్షణాధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అట్టి అరెస్టుపై ప్రజల స్పందన పారదర్శకమైన, నైతికతతో కూడిన, సేవాభావం ఉన్న పోలీసింగ్‌పై ప్రజల స్పష్టమైన ఆశలను ప్రతిబింబిస్తోందని డీజీపీ పేర్కొన్నారు.