..భారత్ న్యూస్ హైదరాబాద్….విరాళాల్లో 85% బీజేపీకే.. ఒక్క బీజేపీ ఆదాయమే రూ.6,769.14 కోట్లు
విరాళాల స్వీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో బీజేపీ కొనసాగుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,769.14 కోట్ల ఆదాయాన్ని బీజేపీ ప్రకటించింది. విరాళాల స్వీకరణలో జాతీయ పార్టీల్లో బీజేపీది నంబర్ ఒన్ స్థానం కాగా రూ. 918.28 కోట్లతో రెండవ స్థానంలో కాంగ్రెస్ నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది.

ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన డిక్లరేషన్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. ఆరు జాతీయ పార్టీలు 2024-25 సంవత్సరానికి ప్రకటించిన మొత్తం ఆదాయం రూ.7,960.09 కోట్లు కాగా ఇందులో 85.03 శాతం వాటా బీజేపీదే.