PDSU రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….PDSU రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి
మహాసభల లోగో ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే
బ్యూరో చీఫ్ వరంగల్. నవంబర్ 4 డిసెంబర్ 10,11,12 తేదీల్లో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మహాసభ లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన PDSU రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు,ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ* చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న PDSU రాష్ట్ర మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరం అవుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలనురూపొందించుకుంటున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడే దారులకు ఊడిగం చేసేందుకే ప్రభుత్వా లను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతుందని అనేక పాఠశాలలు కళాశాలలు యూనివ ర్సిటీలు మూసివేత గురి అవ్వడమే దీనికి తార్కాణం అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే ఉన్న చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటుప రం అయ్యాయని, విద్యా రంగాన్ని కూడా పూర్తిగా ప్రవేట్ పరం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొ చ్చిందన్నారు. దీంతో దేశంలోని ప్రతిష్టా త్మక యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగి ఆర్థిక భారం తో విద్యార్థులు ఉన్నత చదువులకు దూ రం అవుతున్నారన్నారు. విద్యార్థుల మెదలను కలుషితం చేయడం కోసం పాఠ్యాంశాల్లోమూఢనమ్మకాలను,మతోన్మాదం ను చెప్పిస్తుందన్నారు. ఎన్సీఈఆ ర్టీ పాఠ్యాంశాల్లో గాంధీని చంపిన గాడ్సే పాఠాలను తీసివేయడం చరిత్ర వక్రీకరణ లో భాగమే అన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో విద్యార్థులు యువకులు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పో రాటాలు నడుస్తున్నాయన్నారు. విద్యార్థు ల పోరాటాలతో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ లాంటి దేశాల్లో ప్రభుత్వా లే కూలిపోయాయని అన్నారు. అంతర్జా తీయ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో దేశం విద్యార్థులోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర ప్రసాద్,శ్రీపాద శ్రీహరి,రంగవల్లి కోలాశంకర్, దుస్సా చేరాలు లాంటి ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగంతో పురుడోసు కున్న PDSU సంస్థ విద్యార్థుల ఉద్యమా న్నీ తీవ్రతరం చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధి కారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కనీసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబ ర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుం దన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పాలకులు మారిన వారి విధానాలు మారకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు డిసెం బర్ 10 10న ఆర్ట్స్ కాలేజ్ ఆల్టోరియం ముందు బహిరంగ సభ,11 ,12 తేదీల్లో అబ్నుస్ ఫంక్షన్ హాల్లో జరిగే ప్రతినిధుల సభలను జయప్రదం చేయాలని విద్యా ర్థులకు,మేధావులకు,ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారుఈ కార్యక్రమం లో PDSU జాతీయ నాయకులు P.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, pdsu వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్,సి.పి.ఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, పి.డి.ఎస్.యూ మాజీ నాయకులు బాలరాజు,బండి కోటేశ్వర్,అనిల్ రాజేష్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు