భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…2,325 ఎస్జీటీ పోస్టుల రద్దు.. 2,064 కొత్త పోస్టుల క్రియేషన్!
ప్రభుత్వ పాఠశాలల్లో 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసి, వాటి స్థానంలో 2,064 కొత్త పోస్టులను సృష్టించాలని
తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైస్కూళ్లలో హెడ్మాస్టర్లు, పీఈటీ పోస్టుల అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఒక్కో హెడ్మాస్టర్ పోస్టుకు రెండు ఎస్జీటీ పోస్టులను, ఒక్కో పీఈటీ పోస్టుకు ఒక ఎస్జీటీ పోస్టును రద్దు చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రతిపాదనలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…
