ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం

అమరావతి :

ఏపీలో సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా అమలు చేసే ఈ నిబంధన.. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉంటుంది. వేట లేని ఈ సమయంలో మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 17 నుంచి వివరాల సేకరణ ప్రారంభం కానుంది.