మా బడిలో వందేమాతరం 150 ఏళ్ళ వేడుక,

భారత్ న్యూస్ డిజిటల్.హైదరాబాద్: మా బడిలో వందేమాతరం 150 ఏళ్ళ వేడుక.

  • GHS నల్లకుంట

నేడు వందేమాతరం 150 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించడం జరిగింది.
అంతకు ముందు పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ మాట్లాడుతూ… 150 ఏళ్ల భారత దేశ చరిత్రలో
వందేమాతరం జాతీయ గీతంగా మారడానికి దారితీసిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను విద్యార్థులకు వివరించారు.
బంకించంద్ర ఛటర్జీ నవంబర్ 7, 1875 లో రచించిన వందేమాతరం, మొదటగా ఒక డైలీ సీరియల్ గా “బంగ దర్శన్” పత్రికలో వెలువడిన అనంతరం ఆనంద మఠ్ అనే నవలగా రావడం జరిగిందని అన్నారు.
అప్పుడున్న సామాజిక రాజకీయ సాంస్కృతిక మార్పుల కారణంగా విదేశీ పాలనలో కునారిలుతున్న ప్రజలు పరాయి పాలనలోని అణిచివేతలను ధిక్కరిస్తూ జాతీయ భావనను ఆత్మ గౌరవాన్ని ప్రకటించుకునే క్రమంలో వందేమాతరం అనే నినాదం దేశవ్యాప్తంగా విస్తరించిందని తద్వారా దేశ వ్యాప్తమైన భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఉద్యమకారులందరిని ఉద్యమంలో కదం తొక్కేలా స్పూర్తి నింపి చరిత్రలో గొప్ప స్థానాన్ని సాధించుకుందని అన్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ మరియు మొట్టమొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి సారథ్యంలో 1950 జనవరి 24న వందేమాతర గేయాన్ని అధికారికంగా ప్రకటించారనీ అన్నారు.
వందేమాతర గీతం 150 సం.లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తూన్నదని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఎం రవీందర్, ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు శ్రీమతి భవానీ, ఉపాధ్యాయులు నాగమణి, భాగ్యలక్ష్మి, అనిల్ కుమార్, రమేష్, విమల, నీరజ, సంధ్య రాణి, అనిత, శివకళ మరియు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.