భారత్ న్యూస్ విశాఖపట్నం..చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!

MPలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి 23 మంది చిన్నారులు చనిపోవడం తెలిసిందే. వీరికి ఆ దగ్గు మందు ప్రిస్కైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీ సంపాదించింది ఎంతో తెలుసా? ఒక్కో బాటిల్ ధర రూ.24.54 కాగా Sresan కంపెనీ నుంచి అతడికి వచ్చేది 10% కమీషన్ (రూ.2.54). ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రమాదకరమని తెలిసినా సోనీ రిపీటెడ్గా కోల్డ్రిఫ్ ప్రిస్కైబ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.