భారత్ న్యూస్ ఢిల్లీ…..సైనికుల యూనిఫామ్లో ఉగ్రవాదుల సంచారం
భారత సైనికుల దుస్తులను ధరించి పహల్గామ్ అమాయక ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా అదే పంథాను ఉగ్రవాదులు అనుసరిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య తేడాను గుర్తించలేక జమ్మూకశ్మీర్లో స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో సైనికుల దుస్తులను పోలిన యూనిఫామ్లు విక్రయించకూడదని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు.
