సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు

భారత్ న్యూస్ ఢిల్లీ…..సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు

సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారా

సోషల్ మీడియా పోస్టులపై ఇకపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికి వీలులేదు.. మార్గదర్శకాలు జారీ

సోషల్ మీడియా వారియర్ నల్లబాలు కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం

నల్లబాలుపై 3 పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన ఎఫ్ఎఆర్‌లు కొట్టివేత

పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయని నిలదీత

అంశాలు లేకుండా కేవలం రాజకీయ విమర్శ ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ నేరారోపణ పరిధిలోకి రాదని స్పష్టం

కనీస చట్టాలు పట్టించుకోరా?.. సుప్రీంకోర్టు, హైకో ర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘి స్తారా? అని ప్రశ్నించిన న్యాయస్థానం

పరువు నష్టం కేసులు నమోదు చేసే ముందు ఫిర్యాదుదా రుడు చట్టపరంగా బాధిత వ్యక్తేనా?.. అనేది ముందు పోలీసులు ధ్రువీకరించుకోవాలి

నేరాల్లో తప్ప ఇతర కేసుల్లో సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే అది చెల్లదు

ఇష్టారాజ్యంగా, ఆటోమెటిక్‌గా, మెకానికల్‌గా అరెస్టులు అనుమతించబడవని తెలిపిన హైకోర్టు.