భారత్ న్యూస్ ఢిల్లీ…..రేహాన్ ఎంగేజ్‌మెంట్.. ధ్రువీకరించిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రాకు ఎంగేజ్‌మెంట్ (Priyanka Confirms son Engagement) జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. రేహాన్, ఆయన పెళ్లి చేసుకోబోయే అవీవా బేగ్‌లు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులని తెలిపారు. వారి ఫొటోలను కూడా పంచుకున్నారు.
