ఇండియన్ రైల్వే : రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్‌ రైల్‌వన్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇండియన్ రైల్వే : రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్‌ రైల్‌వన్‌

🔶సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి

🚆, దిల్లీ: ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకేచోట అందించే సూపర్‌ యాప్‌ ‘రైల్‌వన్‌’ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఈ యాప్‌ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్లందరికీ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులకు సేవలన్నీ సులభంగా అందుతాయని మంత్రి తెలిపారు. కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ (సీఆర్‌ఐఎస్‌) ఏర్పాటై 40 ఏళ్లయిన సందర్భంగా ఈ యాప్‌ను ఆవిష్కరించామని వెల్లడించారు.

💥సులభంగా.. సరళంగా..

🌀ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంతోపాటు అత్యంత సులభంగా.. సరళంగా ఉండేలా ‘రైల్‌వన్‌’ యాప్‌ ఇంటర్‌ఫేస్‌ను రూపొందించామని రైల్వేశాఖ వెల్లడించింది. ‘ఇది అన్ని సేవలందించే యాప్‌ మాత్రమే కాదు. రైలు సేవల మధ్య సమగ్రమైన కనెక్టివిటీకీ ఉపయోగపడనుంది’ అని ఆ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

➡️యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక.. గతంలో ఉన్న రైల్‌కనెక్ట్, యూటీఎస్‌ఆన్‌మొబైల్‌ యాప్‌నకు ఉన్న లాగిన్‌ వివరాలతో రైల్‌వన్‌లో లాగిన్‌ కావొచ్చు.

➡️సులభంగా లాగిన్‌ అయ్యేలా ఎం-పిన్‌తోపాటు బయోమెట్రిక్‌ సౌకర్యమూ ఇందులో ఉంది.

➡️కొత్త వినియోగదారులు.. సులభంగా రిజిస్టరయ్యేలా అతి తక్కువ సమాచారం అందిస్తే సరిపోతుంది.

➡️రిజిస్టరుకాని వినియోగదారులు.. గెస్ట్‌ లాగిన్‌ ఆప్షన్‌తో మొబైల్‌ నంబరు, ఓటీపీ ద్వారా వివరాలను పొందవచ్చు.

➡️రైల్‌వన్‌ యాప్‌లో ఆర్‌-వాలెట్‌ (రైల్వే ఈ-వాలెట్‌) సౌకర్యం ఉంది. ముందుగానే అందులో డబ్బును జమ చేసుకుని సేవలకు చెల్లించవచ్చు.

➡️ఈ యాప్‌ద్వారా ప్లాట్‌ఫాం టికెట్లను 3% డిస్కౌంట్‌తో పొందొచ్చు.

💥అందించే సేవలు

➡️టికెట్ల బుకింగ్‌ (రిజర్వుడు, అన్‌రిజర్వుడు)

➡️ప్లాట్‌ఫాం టికెట్లు

➡️రైళ్ల సమయాల వివరాలు

➡️పీఎన్‌ఆర్‌ విచారణ

➡️ప్రయాణ ప్లానింగ్‌

➡️రైల్వే హెల్ప్‌లైన్‌ సేవలు

➡️ఆహారం బుకింగ్‌

➡️సరకు రవాణా వివరాలు

➡️ట్యాక్సీ బుకింగ్‌

➡️వీటితోపాటు మరిన్ని సేవలు