భారత్ న్యూస్ ఢిల్లీ…..వక్ఫ్ (సవరణ) చట్టం-2025 లో కీలక నిబంధనను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది.
ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ చట్టం-2025 పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది
కొన్నిసెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎజీ మసీహ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
