నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు

🔅నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి ఇరాన్‌లోని ఓ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నేరపూరత కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెకు ఈ శిక్ష విధించిందని, రెండేండ్లపాటు బహిష్కరణ కూడా విధించిందని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు.

🔅ఇరాన్‌లో మహిళలకు డ్రెస్‌ కోడ్‌ అమలుజేయటం, ఏటా వందలాది మందికి మరణశిక్షలు విధించటాన్ని నిరసిస్తూ ప్రచారాన్ని నిర్వహించినందుకు మొహమ్మదీకి 2023లో నోబెల్‌ పురస్కారం లభించింది.