భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు.

అది పూర్తిగా అసత్య ప్రచారం అని, అలాంటి ప్రతిపాదనేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని Xలో ట్వీట్ చేశారు….