భారత్ న్యూస్ వరంగల్….. …..హైదరాబాద్:ఏప్రిల్ 09
భారత్ 2047 నాటికి భారత్ వికసిత్ దేశంగా ఎదగాలంటే మహిళ శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఆయన కీలకంగా మాట్లాడారు దేశానికి స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2004 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉన్నట్టు తెలిపారు.
అయితే ఈ లక్ష్యం చేరుకోవాలంటే మాతృ శక్తి నారి శక్తి దేశ అభివృద్ధిలో పూర్తిస్థాయిలో భాగస్వా మ్యం కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం నారీశక్తిని ప్రోత్సహిస్తేనే సాధ్యమ వుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 2047 నాటికి… భారతదేశ స్వాతంత్ర్యం వంద సంవ త్సరాలు పూర్తి చేసుకునే సమయానికి… ‘‘వికసిత్ భారత్’’ లక్ష్యాన్ని సాధించాలని భారతదేశం సంకల్పించింది.
అయితే గత రెండున్నర దశాబ్దాలు గా ప్రభుత్వ అధినేతగా నాకున్న అనుభవం ఆధారంగా నేను చెప్పగలిగేది ఏమి టంటే.. మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే.. మన మాతృ శక్తిని మన నారీ శక్తి’ని దేశాభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలి. అని మోడీ కోరారు.2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశంలోని ‘నారీ శక్తి’కి లోక్‌సభ, రాష్ట్ర శాసన సభల్లో ప్రజా ప్రతినిధు లుగా 33 శాతం ప్రాతిని ధ్యం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటు న్నారు.
గత కొద్ది రోజులు గా మేము అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాము.చాలా వరకు పార్టీలు తమ మద్దతును తెలియజేశా యి. ప్రస్తుతం ఒక అత్యంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈ రోజు నేను వార్తాపత్రికల్లో ఒక వ్యాసం రాశాను. అందులో నా ఆలోచనలను పంచుకు న్నాను. దయచేసి మీరు ఆ వ్యాసాన్ని చదవాలని.. అలాగే ఇతరులు కూడా చదివేలా ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని కోరుతు న్నాను.అని ప్రజలకు మోడీ పిలుపు నిచ్చారు.

‘‘అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలను కూడా మీరు ప్రేరేపించి ప్రోత్సహిం చాలి. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో సమావేశమైనప్పుడు ఈ బిల్లును ఆమోదించి.. అందరం కలిసి ఆ విజయాన్ని సంబరంగా జరుపుకోగలుగుతాము.’’ అని మోడీ పేర్కొన్నారు.